📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు

Author Icon By Aanusha
Updated: November 10, 2025 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల దృష్టి ఈరోజు జరగనున్న ముఖ్యమైన కేబినెట్‌ (AP Cabinet) సమావేశంపై కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తు దిశలో కీలక నిర్ణయాలకు వేదిక కానుంది. సీఎం ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read Also: Mukesh Ambani: ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు

విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుతో పాటు జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో కేబినెట్‌ (AP Cabinet) భేటీ జరగనుంది.

విశాఖ వేదికగా నవంబర్ 14,15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై కేబినెట్‌ (AP Cabinet) ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానుండటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పలు కీలక అంశాలపై చర్చ

సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్‌లో ఏర్పాట్లపై మంత్రులను వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు పలు కీలక సూచనలు చేయనున్నారు.అలాగే రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

AP Cabinet

అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ప్రభావం.. దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.

రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం

దీంతో పాటు CRDA పనులు కోసం NaBFID నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా కేబినెట్ ఇవ్వనుంది.ఈ కేబినెట్‌ భేటీలో అత్యంత కీలకంగా పరిగణించదగిన అంశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం ఒకటి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగి ఒక నిర్ణయం తీసుకుంది కూడా. ఆ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.మొత్తంగా… వీటన్నిటితో పాటు మరికొన్ని అంశాలపైనే కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh AP Cabinet Meeting Global Investors Summit Vishakapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.