ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి వైపు మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడే విధంగా రూ. 1,14,824 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది..
Child labor system : చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు?
ఈ నిర్ణయం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాక, ఉద్యోగ సృష్టికి కూడా కొత్త మార్గాలను సుగమం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది..రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు పారిశ్రామిక రంగంలో ఏపీ (AP) ని అగ్రస్థానంలో నిలబెడతాయని భావిస్తున్నారు.ఈ కేబినెట్ సమావేశంలో విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
విశాఖను దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఒక శక్తివంతమైన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు విశాఖకు వస్తున్నాయని,
పెట్టుబడులతో విశాఖ స్వరూపం పూర్తిగా
నగరాన్ని ఒక అంతర్జాతీయ ఐటీ హబ్ (International IT hub) గా మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులతో విశాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతిలో రూ. 212 కోట్ల అంచనా వ్యయంతో నూతన రాజ్‌భవన్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాటు, రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ (Underground drainage system) ఏర్పాటుకు అవసరమైన నిధులలో 25% సీఆర్డీఏ (CRDA) ద్వారా కేటాయించాలని నిర్ణయించారు.
పలు సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులు
ఈ చర్యలతో రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన మరింత ముందుకు సాగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) (DA) వంటి అంశాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం పెట్టుబడులకు ఆమోదం తెలపడమే కాకుండా, ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో తమ కార్యకలాపాలను వేగంగా ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల మంత్రులపై ఉందని స్పష్టం చేశారు.
“రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నాం. ఈ ప్రణాళికల ఫలాలు ప్రజలకు చేరేలా, వాటి ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా వివరించాలి,” అని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మంత్రులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: