📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

AP Bus Accident: ట్రావెల్స్ బస్సులో మంటలు

Author Icon By Anusha
Updated: January 7, 2026 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, (AP Bus Accident) తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ బస్సులో సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో.. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Read also: Minister Kollu Ravindra: గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

AP Bus Accident: Fire breaks out in Travels bus

అదుపులోకి మంటలు

ఈ ఘటనలో సుమారు రూ.80 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు బస్సు సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేశారు.. ప్రయాణికుల్ని అలర్ట్ చేశారు. ఆ వెంటనే బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చేశారు.

సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు తరలించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP bus accident East Godavari Kovvur Bridge latest news Private Travels Bus Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.