Aadabidda Nidhi scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్థికపరమైన కీలక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించనుంది. రైతు సంక్షేమంతో పాటు మహిళల ఆర్థిక సాధికారతకు ఈ బడ్జెట్(Budget)లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
Read Also: CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం

‘ఆడబిడ్డ నిధి’ పథకం
అందులో భాగంగా, ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా మహిళలకు ఇస్తున్న ఈ హామీతో వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: