ఆంధ్రప్రదేశ్‌లో(AP) బీఈడీ అర్హతతో సెెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కీలక సూచనలు జారీ అయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ వర్గానికి చెందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
Read Also: Jobs: ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు
ఈ నెల 25లోపు NIOS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్
2018 నుంచి 2023 మధ్యకాలంలో ఎస్జీటీలుగా(AP) ఎంపికైన బీఈడీ అర్హత కలిగిన వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) పోర్టల్ ద్వారా ఈ నెల 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని తెలిపింది. నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్ లేకపోతే సేవల కొనసాగింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసినవారే ప్రధాన అర్హులని స్పష్టంగా పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బీఈడీ అర్హతతో నియమితులైన వారికి బ్రిడ్జ్ కోర్స్ తప్పనిసరని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాతే వారి నియామకాలు పూర్తిస్థాయి చెల్లుబాటు పొందుతాయని విద్యాశాఖ పేర్కొంది.
ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, గడువు పొడిగింపు కోసం ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో అకాడమిక్ కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి సమయం కావాలని కోరుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: