📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: తిరుమల లడ్డూపై చర్చించాలన్న బొత్స సత్యనారాయణ

Author Icon By Saritha
Updated: February 18, 2026 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలి మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తులో ఎలాంటి కొవ్వు లేదని తేలిందని ఆయన అన్నారు.

ఇందాపూర్ ద్వారా దోచుకోవాలనేది చంద్రబాబు దుర్బుద్ధి. హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మేం కూడా వాస్తవాలు తేల్చాలనే తిరుమల లడ్డూపై మండలిలో చర్చిద్దామని కోరుతున్నాం. ఇందాపూర్‌తో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుంది. సభలో బడ్జెట్‌తో పాటు ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే అని బొత్స అన్నారు.

Read Also: Anantapur Crime: డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య

AP: Botsa Satyanarayana wants discussion on Tirumala laddu

తాము చెబుతున్న దాంట్లో అవాస్తవాలు ఉంటే వాస్తవాలను తేల్చడానికి చర్చకు రావాలని బొత్స సవాల్ విసిరారు. ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని చెప్పారు. రూ.320కి కొనుగోలు చేసే నెయ్యిని రూ.700కి పెంచడం వెనుక ఉన్న కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని అన్నారు. వీళ్లు చేస్తున్న దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతికత లేదని అన్నారు.  

గతంలో తిరుమల లడ్డూ ఇస్తే భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారని, ఇప్పుడు లడ్డూ ఇస్తే పరిశీలించి చూసి తింటున్నారని బొత్స చెప్పారు. మంత్రి నారా లోకేశ్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము పట్టుకోల్పోయామనే భావనలో ఆయన ఉంటే ఉండనివ్వాలని తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Council Botsa Satyanarayana Chandrababu Naidu Heritage Foods Latest News in Telugu Telugu News tirumala laddu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.