AP Bird flu: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండల పరిధిలోని RKVB పేట ఇందిరా కాలనీలో గత నాలుగు రోజులుగా కోళ్లు వరుసగా మరణిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అప్రమత్తమైంది.
Read Also: Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
వైద్యాధికారుల పర్యవేక్షణ
పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (DMHO) సుధారాణి సోమవారం స్వయంగా కోళ్లఫారం ప్రాంతాన్ని సందర్శించారు. కోళ్ల మరణాలకు గల కారణాలను, ప్రస్తుత పరిస్థితులను ఫారం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ముందస్తు జాగ్రత్తలు
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గ్రామంలో వెంటనే మెడికల్ క్యాంప్‌ను నిర్వహించాలని మరియు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. బాధితులు లేదా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: