📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Latest News: AP: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ .. 82,000 కోట్ల భారీ పెట్టుబడి

Author Icon By Aanusha
Updated: November 13, 2025 • 9:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి సృష్టి లక్ష్యాల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖమైన రీన్యూ (ReNew) సంస్థ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Read Also: AP Weather: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు?

ఐదేళ్ల క్రితం రాష్ట్రం (AP) నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి రావడం పెద్ద పాజిటివ్ సిగ్నల్‌గా భావిస్తున్నారు. రీన్యూ సంస్థ పెట్టుబడులు కేవలం పరిశ్రమలకే కాకుండా, పునరుత్పాదక శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నాయి. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ప్రాజెక్టులు, అలాగే గ్రీన్ హైడ్రజన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏర్పాటు దిశగా ఉపయోగపడతాయని సమాచారం.

ఈ సంద‌ర్భంగా విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, ఆయన బృందానికి లోకేశ్ సాదర స్వాగతం పలికారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ సంస్థ తిరిగి రాబోతోందని నిన్న మంత్రి లోకేశ్ చేసిన ప్రకటన వెనుక ఉన్న అసలు విషయం ఇదేనని స్పష్టమైంది.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత భారీ పెట్టుబడిని ఆకర్షించడం, రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చగల కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Breaking News Chandrababu Naidu latest news Nara Lokesh ReNew Renewable Energy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.