Andhra Pradesh lawyers: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలోని న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్(AP Bar Council) న్యాయవాదుల సంక్షేమ కమిటీ శుభవార్త అందించింది. న్యాయవాదులకు సంబంధించిన మరణానంతర ప్రయోజనాలు, వైద్య చికిత్స ఖర్చులు మరియు పదవీ విరమణ సాయానికి సంబంధించి అందిన దరఖాస్తులన్నింటినీ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని, మొత్తం రూ.5.60 కోట్లకు పైగా నిధులను న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు మంజూరు చేసింది.
Read Also: AP Govt: సైనికులకు గాలంట్రీ అవార్డుల నగదు సహాయం పెంపు
ఈ సమావేశానికి హైకోర్టు, ఏపీ న్యాయశాఖ ప్రతినిధులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, కమిటీ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి. నరసింగరావు హాజరయ్యారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలిపారు.
మరణానంతర ప్రయోజనాలు, వైద్య సాయం
మరణానంతర ప్రయోజనాల కింద 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.3.51 కోట్లను మంజూరు చేయగా, తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందిన 137 మంది న్యాయవాదులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.90 కోట్ల ఆర్థిక సాయం(Financial assistance) అందించనున్నారు. అలాగే పదవీ విరమణ ప్రయోజనాల కింద ఏడుగురు న్యాయవాదులకు రూ.19.20 లక్షలు మంజూరు చేశారు. ఈ విధంగా మొత్తం రూ.5,60,80,000 నిధులు లబ్ధిదారులకు అందనున్నాయి.
ఈ ఆర్థిక సహాయం న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని సంక్షేమ కమిటీ పేర్కొంది. మంజూరైన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంపై పలువురు న్యాయవాదులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: