📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu news: AP: “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” పాల్గొనాలని నేతలకు బాబు పిలుపు

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు కీలక సందేశం పంపించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ నెల 11 నుంచి 25 వరకు జరగనున్న ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్రలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో ఉన్న తన వ్యక్తిగత అనుబంధాన్ని ఈ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. మోదీ తీసుకుంటున్న పాలనా నిర్ణయాలు దేశానికి ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.

Read also: CM Chandrababu: ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు

AP: Babu calls on leaders to participate in “Atal Sandesh – Modi’s Good Governance”

వాజ్‌పేయి నాయకత్వం దేశానికి గర్వకారణం

వాజ్‌పేయి ఆత్మస్ఫూర్తిని యువతలో నింపేలా యాత్రను ప్రణాళిక చేసినందుకు బీజేపీ నాయకత్వాన్ని చంద్రబాబు అభినందించారు. అటల్ జీ శతజయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. భారతదేశంలో సుశాసనానికి నాంది పలికింది వాజ్‌పేయి హయమే అని స్పష్టం చేశారు.

దేశ అభివృద్ధికి ఆయన చేపట్టిన విధానాలు పునాదులు వేశాయని వివరించారు. అజాత శత్రువుగా పేరొందిన వాజ్‌పేయి, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకుడని అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి కష్టంతో ఎదిగి, దేశానికి నాయకత్వం వహించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. తొమ్మిది సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికవడం ఆయన ప్రజాదరణకు నిదర్శనమని గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధికి వాజ్‌పేయి అందించిన మద్దతును గుర్తుచేసుకున్న చంద్రబాబు

18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వాజ్‌పేయి, 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు జరిపి భారత్ శక్తిని ప్రపంచానికి చూపించారని చెప్పారు. కార్గిల్ యుద్ధంలో దృఢనిశ్చయంతో శత్రువులను తిప్పికొట్టారని అభినందించారు. ఆయన హయాంలో ప్రారంభమైన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్ట్ దేశ రవాణా రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లిందని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధికి తన కోరికలన్నింటినీ వాజ్‌పేయి అంగీకరించారని, రాష్ట్రానికి ఎంతో మద్దతుగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

APPolitics AtalSandesYatra ChandrababuNaidu ModiGoodGovernance NDAMeeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.