(AP) అమరావతిలో ఆవకాయ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ (AP) పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మూడు రోజుల పాటు విజయవాడలో ఈ ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, సంగీతం, కవిత్వం, నృత్య విభాగాల్లో ఈ ఆవకాయ్ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Read Also: TIFFA Scan: రాష్ట్రంలో తొలి సారి 7 ఆస్పత్రుల్లో TIFFA యంత్రాల ఏర్పాటు
భవానీ ద్వీపం, కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్‌లో ఈ ఆవకాయ్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమం వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. “తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ‘ఆవకాయ’.
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ఉత్సవం లక్ష్యం” అని ఆయన తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: