AP: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, హెరిటేజ్ సంస్థపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ వాటిని నెయ్యిగా పేర్కొని ప్రజలను మరియు సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ సభ్యులకు సరైన అవగాహన ఉందా అని ప్రశ్నించారు. శాసనమండలిలో వారి ప్రవర్తన బాధ్యతారాహిత్యంగా ఉందని కూడా విమర్శించారు.
Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం
బొత్సపై విమర్శలు
ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా తాను స్పష్టంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృథా చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి, “చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు చీజ్‌కు, నెయ్యికి మధ్య తేడా కూడా తెలియదా?” అని ఎద్దేవా చేశారు. అంతగా అనుమానాలు ఉంటే చిన్న ఆధారాన్నైనా సభ ముందు పెట్టాలని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని భారతి సిమెంట్ పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న చరిత్ర వైసీపీదని, కానీ హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పారదర్శకంగా వ్యాపారం చేయాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంస్థ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిత్యం వాయిదా తీర్మానాలతో సభను పక్కదారి పట్టించడం మానేసి, దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలని, నిర్మాణాత్మక చర్చకు రావాలని వైసీపీకి ఆయన సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: