हिन्दी | Epaper

AP Assembly Seats: నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

Pooja
AP Assembly Seats: నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

AP Assembly Seats: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:Srisailam fire accident : శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం

AP Assembly Seats
AP Assembly Seats: Preparations for re-division of constituencies

ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరగడంతో పాటు, లోక్‌సభ సీట్లు కూడా మరో 7 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలుకాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870