📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

AP: వచ్చేనెల ఆర్సెలర్ మిట్టల్స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతిలో క్వాంటంవ్యాలీ ఏర్పాటుకు వేగంగా అడుగులు

విజయవాడ : రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో కీలకమని, గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ) రద్దు వంటి నిర్ణయాల వల్ల చాలా కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. సుస్థిర పాలన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. పుణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్డ్లో లోకేశ్ కీలకోపన్యాసం చేశారు. (AP) ఆంధ్రప్రదేశ్కు గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు క్యూ కట్టడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేశ్ వివరించారు. మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పరిశ్ర మలతో ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి వేగంగా అనుమతులు ఇస్తున్నాం. మూడోది రాష్ట్రంలో, కేంద్రంలో ఖినమోఖి (నాయుడు, మోదీ) నేతృత్వంలోని డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని తెలిపారు.

Botsa Anusha : బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వాట్సాప్ గవర్నెన్స్‌తో 36 శాఖల సేవలు

ఆర్సెలర్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్తో ఒకేఒక్క జూమ్ కాల్ మాట్లాడి, వారి సమస్యను 24 గంటల్లో పరిష్కరించడం వల్లే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను(AP) ఏపీకి తీసుకురాగలిగామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. పరిపాలనలో విప్లవాత్మక టెక్నాలజీని వినియోగిస్తూ మార్పులు తెస్తున్నామన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యి రకాల సేవలను అందిస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో మంగళగిరిలో స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. త్వరలోనే భూ రికార్డులను కూడా బ్లాక్చైన్ టెక్నాలజీపైకి తీసుకొచ్చి, 24 గంటల్లో టైటిల్ మార్పు చేసేలా కసరత్తు చేస్తున్నాం అని వివరించారు. ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు లిఫ్ట్ (ఎస్ఐఎఫ్) పాలసీని తీసుకొచ్చామని లోకేశ్ తెలిపారు. ఒక ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయించేలా ఈ విధానాన్ని రూపొందించామని, కాగ్నిజెంట్ రాకతో పరిశ్రమల ప్రవాహం మొదలైందని చెప్పారు. పరిశ్రమలకు సంబంధించిన సమ స్యలను తానే స్వయంగా 26 వాట్సాప్ గ్రూపుల ద్వారా పర్యవేక్షిస్తున్నానని అన్నారు.

సిఎం డ్రీమ్ ప్రాజెక్ట్ క్వాంటమ్ వ్యాలీ

ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్వాంటమ్ వ్యాలీ అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ అని లోకేశ్ అభివర్ణించారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ వ్యాలీ దేశానికే దిక్సూచిగా నిలుస్తుం దన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు విజన్ను అమలు చేసేం దుకు యువ మంత్రుల బృందంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని, రాష్ట్రానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ఎఐ) ఆకర్షించడమే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Amaravati Andhra Pradesh ArcelorMittal Chandrababu Naidu Latest News in Telugu Nara Lokesh Quantum Valley Steel plant Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.