రాష్ట్రంలో నేటి నుంచి (నవంబరు 21, 2025) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది.స్పౌజ్ కోటా ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈనెల 30 లోగా పూర్తి చేయనుంది. అర్హులైనవారు ఈనెల 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతోపాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
Read Also: CBN Visit: పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు కీలక పర్యటన
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి?
స్పౌజ్ కోటా కింద భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి.దీనికోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన ధ్రువపత్రాలు, సర్వీస్ వివరాలు, భార్య/భర్త ఉద్యోగ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: