News Telugu: AP – ఎయిడ్స్ నిరోధ‌క చ‌ర్య‌ల్లో ఏపీకి రెండో ర్యాంకు

Read Time:  1 min
Aids
Aids
FONT SIZE
GET APP

తొలి త్రైమాసిక ప‌నితీరు ఫ‌లితాల్ని ప్ర‌క‌టించిన న్యాకో అమరావతి : ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నిరోధ‌ చ‌ర్య‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌కు రెండో ర్యాంకు ల‌భించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం (2025-26) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుండి జూన్ వ‌ర‌కు) రాష్ట్ర ప‌నితీరు మ‌రింత మెరుగుప‌డింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఇదే స‌మ‌యంలో 11వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏసారి ద్వితీయ స్థానానికి చేరుకోవ‌డం విశేషం. AP ఈ మేర‌కు ఎపిశాక్స్‌ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ నీల‌కంఠారెడ్డి ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు వివిధ విభాగాల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, వాటి ఫ‌లితాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ప‌నిచేసే నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్‌ (National AIDS Control) Organization) ఏపీశాక్స్‌కు ఈ ర్యాంకును ప్ర‌క‌టించింది. నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు న్యాకో రాష్ట్రాల‌కు 132 స్కోరును నిర్ణ‌యించ‌గా…ఏపీ శాక్స్ 98 స్కోరును(74.2 శాతం) సాధించింది. గతేడాది ఇదే స‌మయం(ఏప్రిల్ -జూన్‌)లో 11వ స్థానంలో ఉన్న ఏపీశాక్స్ రెండ‌వ స్థానానికి చేరుకోవ‌డంప‌ట్ల వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ అభినంద‌న‌లు తెలిపారు.

విభాగాలవారీగా పురోగ‌తి యుఎన్ఎయిడ్స్‌ ల‌క్ష్యం మేర‌కు ఏపీలో ఎయిడ్స్ (AIDS) చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైర‌ల్ లోడ్ త‌గ్గింది. రాష్టంలోని ఎఆర్‌టి సెంట‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంగా నిర్వ‌హించ‌డం, ప‌ర్య‌వేక్షించ‌డం వ‌ల్ల ఏపీశాక్స్ ఈ ప్ర‌గ‌తిని సాధించింది. ఎయిడ్స్ బాధితుల్లో వైర‌ల్ లోడ్ ఎంత త‌గ్గితే అంత మేర జీవ‌న ప్ర‌మాణాలు పెరుగుతాయి. ఏపీలో 2.30 ల‌క్ష‌ల మంది ఎయిడ్స్ బాధితులు మందులు వాడుతున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసే విభాగంలో ల‌క్ష్యానికి మించి పోస్టులు పెట్టినందుకు గాను ఏపీశాక్స్‌కు గుర్తింపు ల‌భించింది. ముఖ్యంగా హెచ్ఐవి HIV యాక్ట్‌-2017పై ఇ-మాడ్యుల్స్ (ఆన్‌లైన్‌) విధానంలో స్కూళ్లు, కాలేజీల్లో అవ‌గాహ‌ననా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించ‌డం, విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్లు జారీ చేయ‌డంలో ఏపీశాక్స్ మంచి ఫ‌లితాల్ని సాధించింది.హెచ్ఐవి అనుమానితులకు ప‌రీక్ష‌లు చేసేందుకు ఉద్దేశించిన టార్గెట్‌డ్ ఇంట‌ర్వెష‌న్స్‌, లింక్ వ‌ర్క‌ర్స్ స్కీం విభాగాల్లో నూరు శాతం ప్రగ‌తిని సాధించింది. క‌మ్యూనిటీ ఆర్గ‌నైజేష‌న్లు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు( ఎన్జీఓలు), అవుట్ రీచ్ వ‌ర్క‌ర్ల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏపీశాక్స్ స‌మ‌ర్ధ‌వంత‌గా నిర్వ‌హించింది. రాష్ట్ర‌వ్యాప్తంగా 26 టార్గెటెడ్ ఇంట‌ర్వెష‌న్ సెంటర్లు, 13 లింక్ వ‌ర్క‌ర్ స్కీం కేంద్రాలున్నాయి.

Aids

టార్గెటెడ్ ఇంట‌ర్వెష‌న్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌లేని ఎయిడ్స్ Aids బాధితులు అవుట్ రీచ్ స్కీం సెంట‌ర్ల ద్వారా సేవ‌ల‌న్ని పొందొచ్చు. సిఫిలిస్ పాజిటివ్ వ‌చ్చిన గ‌ర్భిణిలకు 100 శాతం మేర చికిత్స అందించి ఏపీశాక్స్ మ‌రో గుర్తింపును పొందింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఐసిటిసి, డియ‌స్ఆర్‌సిల ద్వారా దీన్ని సాధించింది. త‌ల్లి నుండి బిడ్డ‌కు సిఫిలిస్ రాకుండా నివారించ‌డంలో 100 శాతం మేర ఫ‌లితాన్ని సాధించింది. అలాగే శిశువుల‌కు నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డంలో కూడా 95 శాతం మేర ల‌క్ష్యాన్ని సాధించింది. హెచ్ఐవి క‌వ‌రేజీ విభాగంలో న్యాకో నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌తి ఏడాది హైరిస్క్ గ్రూపుల‌ను చేరుకోవ‌డంలో జాతీయ స్థాయిలో ల‌క్ష్యం 90 శాతం ఉండ‌గా, ఏపీ 124 శాతాన్ని సాధించింది. హెచ్ ఐవి హాట్ స్పాట్ల‌ను గుర్తించి మ్యాపింగ్ చేసి, త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో ఎయిడ్స్ వ్యాప్తిని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌గ‌లిగింది. ఎయిడ్స్ బారిన ప‌డిన కొత్త వ్య‌క్తుల్ని గుర్తించ‌డంద్వారా ఇది సాధ్య‌ప‌డింద‌ని ఏపీ శాక్స్ అధికారులు తెలిపారు. న్యాకో మంజూరు చేసిన నిధుల్ని 99 శాతం మేర ఖ‌ర్చు చేయ‌డంతో పాటు, నిర్దేశిత కాలంలోగా న్యాకోకు యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేయ‌డంలో ఎపిశాక్స్ ముందుంది.

ఎయిడ్స్‌ వ్యాప్తి నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్ సాధించింది?
రెండో ర్యాంక్.

ఈ ర్యాంక్ ఏ కాలానికి సంబంధించినది?
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్).

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/beach-festival-suryalanka-beach-festival-postponed/breaking-news/552424/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.