📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ

Author Icon By Rajitha
Updated: October 24, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం విజయవాడ (vijayawada) : దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ ముందుందని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. పూర్వోదయ పధకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖపట్నం గ్రోత్ హబ్, పూర్వోదయ పధకాల పై గురువారం ఎపి సచివాలయంలో నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తో సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మ ణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగాపోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. అదే విధంగా రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పధకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్ధం చేసుకోవాలని సిఎస్ విజయానందు ఆయన సూచించారు.

Read also: Kurnool Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం

AP: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ

అనంతరం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయా నంద్ మాట్లాడుతూ విశాఖపట్నం (vishsakapatnam) గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యే కంగా ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవతంగా ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు అనేక నూతన ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు, పధకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరుగుతోందని కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యంకు విజ్ఞప్తి చేశారు.

కాగా పూర్వోదయ అనేది దేశ తూర్పతీరంలోని ఆంద్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పధకం. ఇది సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వనరులను ఉపయోగించుకోవడం, కొత్త మోలిక సదుపాయాలను సృష్టించడం, ఉపాధిని సృష్టించడం మరియు స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం ద్వారా తూర్పు భారతదేశాన్ని జాతీయ పురోగతికి కీలకమైన చోదకంగా మార్చాలనే లక్ష ్యంతో పూర్వోదయ పధకాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పెద్దఎత్తున విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన మోలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది.

ఏ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు?
ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ఆయన ఏ అంశంపై చర్చించారు?
పూర్వోదయ పథకం, విశాఖ గ్రోత్ హబ్‌పై చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh BVR Subrahmanyam latest news NITI Aayog Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.