📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Author Icon By Rajitha
Updated: October 19, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ కానుకను అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను ఒక నెల పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన డీఏ నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.160 కోట్ల అదనపు భారం పడనున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉద్యోగులు రాష్ట్ర పురోగతిలో కీలక భాగస్వాములని పేర్కొంటూ, “మీ కృషితోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. అందరూ ఆనందంగా దీపావళిని జరుపుకోవాలి” అని అన్నారు.

Rwad also: YCP : అధికారంలోకి వచ్చేస్తామని YCP కలలు కంటోంది: పార్థసారథి

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

సీపీఎస్ రద్దు

ఇకపోతే, పోలీస్ శాఖ సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో రూ.105 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లించనున్నారు. అదేవిధంగా, ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు దీపావళికి (Diwali) ముందే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి వచ్చే 60 రోజుల్లో సంస్కరణలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. వారి సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి బలం” అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఏపీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఏం ప్రకటించింది?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఒక నెల డీఏ (కరువు భత్యం) పెంపు ప్రకటించింది.

పెంచిన డీఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
నవంబర్ 1వ తేదీ నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu DA Hike Government Employees latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.