తిరుచానూరులో జరిగే శ్రీ పద్మావతి (padmavathi) అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 17 నుంచి 25 వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాల ఆరంభ సూచకంగా జరిపే అంకురార్పణ కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన జరుగుతుంది. సాయంత్రం పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం మరియు యాగశాలలో అంకురార్పణ కర్మలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
Read also: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం
AP: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ..
24న రథోత్సవం
నవంబర్ 17న ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అనంతరం తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు అలంకార దర్శనం ఇస్తారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో వాహన సేవలు జరుగుతాయి. ఉత్సవాల్లో 22వ తేదీన స్వర్ణరథం మరియు గరుడ వాహన సేవ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 24న రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. నవంబర్ 25న ఉదయం పంచమీ తీర్థం (చక్రస్నానం), రాత్రి ధ్వజావరోహణంతో కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: