AP: రద్దీగా మారిన రహదారిపై చంటిబిడ్డను చేతిలో పట్టుకుని ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా అభినందించారు. గురువారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకాగా, మంత్రి స్వయంగా ఆమెను కలసి సత్కరించారు.
Read Also: AP: మాతా, శిశు మరణాలు తగ్గించాలి
డ్యూటీలో లేనప్పటికీ జయశాంతి చూపిన బాధ్యతాభావం
సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై చోటుచేసుకున్న సంఘటనలో, డ్యూటీలో లేనప్పటికీ జయశాంతి(Constable Jayashanthi) చూపిన బాధ్యతాభావం అందరి మనసులను కదిలించింది. చేతిలో చిన్నబిడ్డను పెట్టుకొని ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్‌కు మార్గం సుగమం చేయడం ద్వారా ఆమె సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తన దృష్టికి రావడంతో హోంమంత్రి అనిత జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఆ ఫోన్ సంభాషణలోనే మంత్రిని కలవాలన్న తన కోరికను జయశాంతి వ్యక్తం చేయగా, తాజాగా ఆ కోరికను నెరవేర్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, కర్తవ్య నిర్వహణలో అంకితభావంతో పనిచేసే మహిళా పోలీసుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. పోలీస్ శాఖలో సేవలందిస్తున్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయశాంతిని సత్కరించిన క్షణాల ఫొటోలను మంత్రి అనిత తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: