ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే ఆయన ను, పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన ను, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్లీప్ అప్నియా అనే ప్రత్యేక పరికరాన్ని జైలు అధికారులు సమకూర్చారు.
Read Also: Andhra Pradesh: ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఎపి: సిఎం చంద్రబాబు
కోర్టు ఆదేశాల మేరకే
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్దరణ అవుతుంది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది. కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: