📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

AP: లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వచ్చిన తర్వాత వీరిద్దరూ నోరు మెదపడం లేదని అన్నారు. ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించారని అన్నారు. 

Read Also: Deputy CM Pawan: కాలుష్యానికి కళ్లెం వేద్దాం

(AP) పవన్ చంద్రబాబుకు చెంచాగా మారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఉందన్న విషయమే మరిచిపోయారని విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.

నెయ్యి శాంపిల్స్ కోసం ట్యాంకర్లు కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చినట్లు అంబటి తెలిపారు. నివేదికల ప్రకారం శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికల్లో ఉన్నా కానీ వైసీపీపై బురద చల్లేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. బోలేబాబా వ్యవహారమూ చంద్రబాబు హయాంలోనే చోటుచేసుకున్నదని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ambati rambabu Chandrababu Naidu Laddu controversy Latest News in Telugu Pawan Kalyan Telugu News tirumala laddu TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.