విజయవాడ : అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును (ఓఆర్ఆర్)140 మీటర్లకు విస్తరించి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్కెచ్) శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన తొలి అడుగు ఆర్థిక ప్రతిపాదనల రూపకల్పనకు సిద్ధమవుతుంది. సాధారణంగా ఒక గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కనిష్టంగా ఏడాది కాలం పడుతుంది. అయితే అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణ పనులను (ORR construction works) ఆరు నెలల్లో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్ల దశకు ప్రాజెక్టును వీలైనంత త్వరగా తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. టెండర్లు పిలిచిన తర్వాత ఆలస్యం కాకుండా పనులు ప్రారంభం కావాలంటే భూములు సిద్ధంగా ఉండాలి. అందుకనే భూ సేకరణలో భాగంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఎన్హెచ్ అధికారులు (NH officials) ఐదు జిల్లాల జాయింట కలెక్టర్లను ఇప్పటికే కోరారు.. అందులో భాగంగా కన్సల్టెన్నీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. అమరావతి డివిజన్ ఎన్వాచ్ అధికారులు గతంలో 70 మీటర్ల వెడ్పూతో ఓఆర్ఆర్ నిర్మాణానికి ఆర్థిక ప్రతిపాదనలు రూపొందించారు. వాటిలో ప్రధానంగా భూ సేకరణ, నిర్మాణ వ్యయం అంతర్భాగంగా ఉంటాయి.
విస్తరించనున్న ఓఆర్ఆర్ – వ్యయం రూ.21 వేల కోట్లకు, భూసేకరణతో ప్రతిపాదనలు మారిన దశ
ప్రాజెక్టుకు మొత్తంగా రూ.16,200 కోట్లు ఖర్చవుతుందని, అందులో భూసకరణకు రూ.2600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ఓఆర్ఆర్ వెడల్పును 140 మీటర్లకు విస్తరించడానికి కేంద్రం ఆమోదన తెలిపిన నేపథ్యంలో తిరిగి ఆర్థిక ప్రతిపాదనలను రూపొం దించాల్సి వచ్చింది. రెట్టింపు భూసేకరణ చేయాల్సి ఉండటంతో అందుకు గతంలో కేటాయించిన దానికంటే రెట్టింపు.. అంటే సుమారుగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. దీనితో పాటు సహజంగానే నిర్మాణ ఖర్చు కూడా పెరుగుతుంది. మొత్తం మీద 140 మీటర్ల వెడల్పున ఓఆర్ఆర్ను విస్తరించాలంటే సుమారుగా రూ.21 వేల కోట్లు వ్యయాన్ని ఎన్వోచ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ సర్వే రిపోర్టులను క్రోడీకిరించి, రెండు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిచాలని ఎన్హెచ్ అధికారులు బావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే క్షేత్రస్థాయిలో పనులకు శ్రీకారం చుడతారు. ఓఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, దీనిని పట్టాలెక్కించడానికి ప్రభుత్వాల లోని పలు శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
Ap లో అత్యంత ధనిక నగరం ఏది?
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ధనిక మరియు ఖరీదైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత పేద నగరం ఏది?
దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో, ఏపీ మూడవ స్థానంలో ఉండగా, కేరళ కేవలం 0.74 శాతం పేద జనాభాతో అట్టడుగున ఉంది. ఏపీలో, కర్నూలు జిల్లా 20.69 శాతం పేదలతో అగ్రస్థానంలో ఉంది, విజయనగరం (19 శాతం) రెండవ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా 13 జిల్లాల్లో కేవలం 8.31 శాతం పేదలతో అట్టడుగున ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ పాత పేరు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ గురించి మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణం వంటి సంస్కృత గ్రంథాలలో కనిపించే ఒక తెగ పేరు. ఈ ప్రాంతాన్ని దక్షిణాపథం అని మరియు ప్రజలను ఆంధ్రులు అని పిలుస్తారు. ఇతర ప్రస్తావనలు రామాయణం మరియు మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలలో కనుగొనబడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Nimmala Rama Naidu: మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి అప్పగింత