📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP: హరిత రాజధానిగా అమరావతి

Author Icon By Ramya
Updated: July 19, 2025 • 9:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో భాగంగా ‘గ్రీన్ కేపిటల్’ నిర్మాణం

vijayawada: ‘స్వర్ణాంధ్ర 2047’ (Swarnandhra 2047) లక్ష్యాల సాధనలో భాగంగా, 2040 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను శూన్యం చేసే లక్ష్యాన్ని సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా రాజధాని అమరావతిని హరిత రాజధానిగా నిర్మించేందుకు సిఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) సంయుక్త సౌజన్యంతో ఏపీ (AP) సిఆర్డిఏ ఆధ్వర్యంలో విజయవాడలోని ఫార్ట్యూన్ మురళి పార్కులో కెపాసిటీ బిల్డింగ్పై వర్క్షాప్ జరిగింది. వర్క్షాప్లో సిఆర్డిఏ ఇంజినీర్అన్చీఫ్, చీఫ్ ఇంజినీర్ (హౌసింగ్ బిల్డింగ్), డైరెక్టర్ (ప్లానింగ్), డైరెక్టర్ (పర్యావరణం) సహా 50 మందికి పైగా సీని యర్ అధికారులు పాల్గొన్నారు. ఐజిబిసి గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ విధానాలపై ప్రామాణిక శిక్షణ అందిం చడంతో పాటు, భవిష్యత్ ప్రాజెక్టుల్లో పర్యావరణహిత అభివృద్ధి సిద్ధాంతాలను అనుసరించేలా అధి కారులకు అవగాహన కల్పించడం జరిగింది. సిఆర్డిఎ కమిషనర్ కమిషనర్ కె. కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

AP: హరిత రాజధానిగా అమరావతి

పర్యావరణ పరిరక్షణలో ముందస్తు ఆలోచనలతో అమరావతిని గ్రీన్ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఏపీ సీఆర్ఏ యత్నాలు

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని, ప్రజారాజధాని అమరావతిని (Amaravati) దేశంలోనే అత్యంత ఆదర్శమైన హరిత రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష ్యంతో సీఆర్ఏ పని చేస్తోందన్నారు. రాజధానిలోని ప్రతి ప్రాజెక్టులోనూ సుస్థిరాభివృద్ధి పద్ధతులను అనుసరిస్తున్నామని, నెట్ జీరో విధానాలతో అమరావతిలో నిర్మించిన ఏపీ సిఆర్ డి ప్రాజెక్ట్ కార్యాలయం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అమరావతి నిర్మాణంలో ఐ జి బి సి యొక్క భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్కు 2018లోనే ఐజిబిసి గ్రీన్ సిటీ ఖిప్లాటినం రేటింగ్లో లభించిందని, దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజైన్ దశలోనే ఈ రేటింగ్ సాధించిన నగరంగా మన అమరావతి నిలిచిందని ఆయన గుర్తు చేశారు. అమరావతి చాప్టర్ ఛైర్మన్ మేకా విజయ్ సాయి మాట్లాడుతూ ఏపీ సిఆర్ డి నిర్మిస్తోన్న ప్రాజెక్టులలో ఐజిబిసి గ్రీన్ రేటింగ్ను అనుసరించడం ద్వారా రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసిందన్నారు. ఈ భాగస్వామ్యం ప్రభుత్వ సంస్థలు, గ్రీన్ బిల్డింగ్ కౌన్సిళ్లు కలసి పని చేస్తే సాధ్యమయ్యే సానుకూల మార్పునకు ఉదాహరణ గా పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం ద్వారా అమరావతిని సుస్థిరమైన, పర్యావరణహితమైన, ప్రపంచస్థాయి హరిత రాజధానిగా అభివృద్ధి చేయాలన్న లక్ష ్య సాధనలో ఏపీ సిఆర్ డి మరో ముందడుగు వేసింది.

అమరావతి చరిత్ర ఏమిటి?

అమరావతి ఒక ప్రాచీన బౌద్ధ కేంద్రంగా, శాతవాహనుల కాలంలో ధాన్యకటకంగా పేరుగాంచింది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం బౌద్ధ స్థూపం, శిల్పకళలతో ప్రఖ్యాతి గాంచింది.

అమరావతి దేనికి ప్రసిద్ధి చెందింది?

అమరావతి బౌద్ధ ధర్మం, ప్రాచీన బౌద్ధ స్థూపం మరియు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇది శాతవాహనుల కాలంలో బౌద్ధ కేంద్రంగా అభివృద్ధి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Tirumala : సెప్టెంబ‌ర్ 24న ప్రారంభం కానున్న శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు : ఇస్రో సేవ‌లు

Amaravati Breaking News green capital IGBC partnership latest news net zero emissions Sustainable Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.