📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

Author Icon By Tejaswini Y
Updated: January 30, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాట్ల కేటాయింపులో ఎదురవుతున్న సాంకేతిక, వాస్తు దోషాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Chevireddy : జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

AP: Huge relief for Amaravati farmers..

వీధిపోట్ల సమస్యకు పరిష్కారం

ప్లాట్ల కేటాయింపులో భాగంగా తమకు ‘వీధిపోట్లు’ ఉన్న ప్లాట్లు వచ్చాయని, దీనివల్ల వాస్తు పరంగా ఇబ్బందులు ఉన్నాయని చాలా కాలంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఉచిత రిజిస్ట్రేషన్లు.. వేగంగా మ్యూటేషన్

రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రైతుల నుంచి ఎలాంటి రుసుము (Registration Fee) వసూలు చేయకూడదని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఉండవల్లికి చెందిన 195 మంది రైతులకు సంబంధించి 381 నివాస, వాణిజ్య ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ఈ-లాటరీ (ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్) ద్వారా పారదర్శకంగా పూర్తి చేశారు.

అనాథ చిన్నారులకు అండగా ప్రభుత్వం

రాజధాని ప్రాంతంలోని సామాజిక అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి పరిధిలో నివసిస్తున్న అనాథ చిన్నారుల సంక్షేమం కోసం నెలకు రూ. 5,000 పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం రాజధాని అభివృద్ధి పనులపై ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం వంటి గ్రామాల్లో గ్రామసభలు జరుగుతున్నాయి. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ రాజధాని పనులను పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amaravati Farmers News Amaravati Veedhipotu issue AP Government Pension for Orphans CRDA Plots Allocation Free Registration for Farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.