📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

Author Icon By Aanusha
Updated: November 10, 2025 • 7:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీజీ విద్యను పూర్తి చేసుకున్న 227 మంది వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) తెలిపారు.

Read Also: AP SVAMITVA : నేటి నుంచి ఏపీలో ‘స్వామిత్వ’ గ్రామసభలు

ప్రభుత్వ (AP) వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.ఇన్‌సర్వీస్ కోటాలో 12 వేర్వేరు విభాగాల్లో పీజీ పూర్తి చేసిన ఈ వైద్యులను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు.

వీరిలో 33 ఏరియా ఆస్పత్రుల్లో 60 మంది, ఏడు జిల్లా ఆస్పత్రుల్లో 10 మంది, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రుల్లో ఇద్దరు స్పెషలిస్టులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అత్యధికంగా గూడూరు ఏరియా ఆస్పత్రికి నలుగురు స్పెషలిస్టులను కేటాయించారు.

AP

వీరిలో చిన్నపిల్లల వైద్యుడు, రేడియాలజిస్ట్, చర్మవ్యాధి నిపుణుడు, పాథాలజిస్ట్ ఉన్నారు.నియమితులైన 227 మందిలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో 35 మంది చొప్పున, జనరల్ సర్జరీలో 30 మంది, మత్తు వైద్యులు 26 మంది, చిన్నపిల్లల వైద్య నిపుణులు 25 మంది, ఎముకల వైద్యులు 18 మంది, రేడియాలజిస్టులు 17 మంది,

కంటి, ఈఎన్‌టీ వైద్య నిపుణులు కూడా ఉన్నారు. 2022-23లో ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరిన 257 మంది పీహెచ్‌సీ వైద్యులు ఇటీవల తమ కోర్సులు పూర్తి చేశారు. వారిలో 227 మందిని సెకండరీ ఆస్పత్రుల్లో నియమించగా, ఖాళీలు లేకపోవడంతో మిగిలిన 30 మందికి డీఎంఈ పరిధిలోని ఆస్పత్రుల్లో ట్యూటర్లుగా అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh health department latest news Minister satyakumar Secondary Hospitals Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.