మదనపల్లె క్రైమ్ : విద్యాశాఖలో అవినీతి తిమింగ లాలపై ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. (AP) స్కూల్ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి భారీగా లంచం (Bribery) డిమాండ్ చేసిన అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలోని ఎబిసి స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు, తన పాఠశాలలో 8, 9, 10వ తరగతుల అప్ గ్రేడేషన్ కోసం అనుమతి కోరుతూ గత ఏడాది అక్టోబర్లో మదనపల్లి డివైఇఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలరోజుల అనంతరం ఆ ఫైల్ డివైఇఓ కార్యాలయంలోని ఎడి బెంచ్కు చేరింది. అయితే, ఈ ఫైల్ను ముందుకు కదిలించి అనుమతి మంజూరు చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష అలియాస్ మున్నా రూ.70వేలు డిమాండ్ చేశారు.
Read Also: AP: రాములవారికి 2కోట్లు విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు
లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కిన విద్యాశాఖ
అంత డబ్బు ఇవ్వలేని కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు తెలపటంతో కనీసం రూ.45వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. వారి కోరిన నగదు ఇవ్వకపోవడంతో అనుమతి కోసం దరఖాస్తు చేసిన ఫైల్లో లోపాలు ఉన్నాయంటూ డివైఇఓ కార్యాలయానికి పంపేశారు. (AP) అధికారులు కోరిన సొమ్ము ఇచ్చుకోలేక బాధితుడు కడప ఎసిబి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఎసిబి డిఎస్పీ సీతారామారావు, సిఐ నాగరాజు నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం నిఘా పెట్టింది.
మదనపల్లిలోని డిఇఓ కార్యాలయంలో శేషాద్రినాయుడు నుంచి రూ.45వేలు లంచం తీసుకుంటుండగా రాజశేఖర్, మున్నాలను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పి సీతారామారావు స్కూల్ పర్మిషన్ కోసం బాధితుడిని వేధించి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు. విచారణ జరుపుతున్నామన్నారు. విచారణ అనంతరం నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: