విజయనగరం : విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పాండ్రంకి సురేష్(23)కి 20 సంవ త్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించారు. అలాగే నిధితుడికి రూ.2,500 జరిమానా, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంకు చెందిన పాండ్రంకి సురేష్ అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడన్నారు. ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై పూసపాటిరేగ పోలీసు స్టేషను ఎఎస్ఐ 17.10.2024న పోక్సో కేసు నమోదు చేశారన్నారు.
Read also: Chandrababu Davos : అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు
Accused in POCSO case sentenced to 20 years in jail
అనంతరం అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంకు చెందిన పాండ్రంకి సురేష్(23) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో (pocso) కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి 20సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,500లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ జనవరి 19న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.
బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం
ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం. ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్ఐ దుర్గా ప్రసాద్, సి.ఎం.ఎస్. హెచ్.సి.సిహెచ్.రామకృష్ణ, కోర్టు ఎఎస్ఐ పి. సురేష్ స్పెషల్ పిపి ఎం. ఖజానారావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: