ఒంగోలు, : ఒంగోలు పట్టణంలో జరుగుతున్న అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా 3వ రోజు శ్రీజనమంచి గౌరీజీ యువ పురష్కారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు (Kambhampati Haribabu) విచ్చేశారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నూజిళ్ళ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ యాగంటి గోపి, పురష్కార గ్రహీత మదనపల్లికి చెందిన వెల్ విషర్ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ గిరీష్ నల్లగుట్ట, రాష్ట్ర మహా సభల స్వాగత సమితి అధ్యక్షులు శివారెడ్డి పాల్గొన్నారు. నూజిళ్ళ శ్రీనివాస్ జనమంచి గౌరీ శంకర్ స్పూర్తిదాయక జీవితం గురించి ప్రస్తావన చేశారు. ముఖ్య అతిధి చేతుల మీదుగా పురష్కారం అందజేయబడింది.
Read also: VB-G RAM G: ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!
AP ABVP
గౌరిజీ జీవితం నుండి సేవ చేసే లక్షణాన్ని
ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ కంభంపాటి హరిబాబు ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి స్పూర్తిదాయక ప్రసంగం చేశారు. గౌరిజీ జీవితం నుండి సేవ చేసే లక్షణాన్ని అలవర్చుకోవాలి అన్నారు. గౌరీజీ పేరు మీద సేవా సంస్థల నిర్వాహకులకు అవార్డు ఇవ్వడం అభినందనీయo అన్నారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ డిగ్రీలతో పాటు అలవర్చుకోవాలి అన్నారు. నూతన విద్యా విధానం అమలు సమాజంలో మంచి ప్రయోజనాలు అందిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు మెరుగు పరచడంలో దేశ సమైక్యతను బలోపేతం చేయడంలో ఏబీవీపీ ప్రారంభించిన సీల్ ప్రాజెక్ట్ కీలక పాత్ర వహించింది అన్నారు. విద్యార్థులు ఇక్కడ పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు.
డ్రగ్స్ వినియోగంపై యువత విద్యార్థులు పోరాడాలని
అభివృద్ధి పథంలో నడుస్తూ ప్రపంచ వ్యాప్తంగా విశ్వ గురు స్థానంలో ఉన్న భారతదేశంలో నేడు యువత అధికశాతం ఉండటం ప్రయోజనకరమని అయితే నేడు ప్రధాన సమస్యగా మారిన డ్రగ్స్ వినియోగంపై యువత విద్యార్థులు పోరాడాలని అన్నారు. ఇందుకు సంబంధించి మంచి కార్యక్రమాలని రూపొందించి విద్యార్థులలో యువతలో డ్రగ్స్ పట్ల వ్యతిరేకతకు అవగాహన కలిగించాలని ఏబీవీపీ కార్యకర్తలను మార్గద ర్శనం చేశారు. తిరుపతికి చెందిన డాక్టర్ లక్ష్మీ నారాయణ సంచాలకత్వంలో సాగిన కార్యక్ర మంలో పెద్ద ఎత్తున ఏబీవీపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్చార్జి రావులపల్లి నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. కంభంపాటి హరిబాబుతో పూర్వ పరిచయం ఉన్న అనేక మంది మిత్రులు, కార్యకర్తలు వారిని కలిసి జాపకాలు పంచుకొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: