📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Telugu news: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

Author Icon By Tejaswini Y
Updated: December 17, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: రుషికొండలో నిర్మించిన భవనాల భవిష్యత్ వినియోగంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వహయాంలో నిర్మితమైన ఈ నిర్మాణాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం(Kutami government) సమగ్రంగా చర్చలు జరుపుతోంది. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే పలు పేరున్న హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. తాజాగా వెలువడిన కొత్త ఐడియాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

Read also: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

హోటల్ దిగ్గజాల భారీ ప్రతిపాదనలు

రుషికొండ భవనాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, విలాసవంతమైన ఆతిథ్య హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రముఖ సంస్థలు సూచించాయి. లగ్జరీ బీచ్ విల్లాలు(Luxury beach villas), హైఎండ్ రిసార్టులు(High-end resorts), సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించాయి. ఈ బాధ్యత తమకు అప్పగిస్తే సమగ్ర డిజైన్‌తో ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా రూపొందిస్తామని సంస్థలు హామీ ఇచ్చాయి.

ఈ ప్రతిపాదనలు సమర్పించిన సంస్థల్లో టాటా ఎంటర్‌ప్రైజెస్‌(Tata Enterprises)కు చెందిన ఐహెచ్‌సీఎల్ గ్రూప్, ఎట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ, ద లీలా గ్రూప్, హెచ్‌ఈఐ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఐహెచ్‌సీఎల్ ప్రతిపాదన ప్రకారం విల్లాలు, స్విమ్మింగ్ పూల్స్, స్పా, యోగా సెంటర్లతో పాటు సమావేశాల కోసం ప్రత్యేక కన్వెన్షన్ బ్లాక్‌ను ఏర్పాటు చేయవచ్చు. కళింగ బ్లాక్‌ను మాడ్యులర్ కాన్ఫరెన్స్ హాల్స్, డైనింగ్ స్పేస్‌లకు వినియోగించాలన్న ఆలోచనను ముందుకు తెచ్చారు.

రుషికొండ బీచ్‌పై లగ్జరీ ప్రాజెక్టులు..

అలాగే క్లబ్ హౌస్‌లో జిమ్, స్పా(spa), యోగా డెక్(Yoga deck), మినీ థియేటర్(Mini theater), ఫుడ్ అండ్ బేవరేజెస్ అవుట్‌లెట్లు(Food and Beverage Outlets) ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక బ్లాక్‌ను ఆర్ట్ గ్యాలరీలు, హస్తకళల మార్కెట్, ఎగ్జిబిషన్లు, ఉత్సవాల కోసం వినియోగించవచ్చని, మరో బ్లాక్‌లో చరిత్ర, సహజ వారసత్వానికి సంబంధించిన గ్యాలరీలు, ఆర్కైవ్స్ ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదించారు.

సూర్యవనం, చంద్రవనం, తారావనం వంటి ప్రత్యేక థీమ్ గార్డెన్లతో పాటు సముద్రతీరాన్ని తిలకించేలా ఒలింపిక్ స్థాయి ఇన్ఫినిటీ పూల్ నిర్మాణం కూడా ప్రతిపాదనల్లో ఉంది. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో 200 నుంచి 250 వరకు స్టాండర్డ్, డీలక్స్ గదులు, విల్లాలు, స్పా, ఫిట్‌నెస్ సెంటర్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయవచ్చని సూచించారు.

గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చే దిశగా అడుగులు

సీఆర్‌జెడ్ నిబంధనల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లభిస్తే నేరుగా బీచ్‌కు వెళ్లే మార్గం కల్పించాలని, చుట్టుపక్కల ప్రభుత్వ భూమిని సుందరీకరణ, వినోద కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సంస్థలు కోరాయి. మొత్తం 1,517 ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన అనంతరం రుషికొండ భవనాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Tourism Hospitality Proposals Luxury Beach Villas Rushikonda Buildings Rushikonda Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.