ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపు వివాదం తీవ్ర సంచలనం సృష్టించింది. తనకు మద్యం షాపు కేటాయించాలంటూ రూ.20 లక్షల లంచం డిమాండ్ చేశారని నంబూరి వెంకటరమణ అనే షాపు యజమాని ఆరోపించారు. డబ్బులు ఇవ్వనందుకే తన షాపుకు నిప్పు పెట్టించారని బాధితుడు వాపోయారు. ఈ ఘటన అనంతపురం (Ananthapuram) జిల్లాలో చోటు చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
Read also: Sankranti Celebrations : నారావారిపల్లెకు చేరుకున్న CM చంద్రబాబు
liquor shop was set on fire for not giving money
బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చారని
టీడీపీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు స్వయంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని వెంకటరమణ తెలిపారు. బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చారని, దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తానని బాధితుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావు లేదని, బాధితులకు న్యాయం జరగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారిక విచారణ జరగాలని డిమాండ్ పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: