AP: ముగ్గురిపై చిరుతపులి దాడి.. బొందలవాడలో భయం.. భయం

Read Time:  1 min
leopard attacked three people
leopard attacked three people
FONT SIZE
GET APP

అనంతపురం : అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో సోమవారం చిరుతపులి (Leopard) దాడిచేసి ముగ్గురిని గాయపర్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. బొందల వాడ గ్రామానికి చెందిన కోనంకి నాయుడు, లక్ష్మిదేవి, అంకె నారాయణ స్వామి అనే వ్యక్తులపై చిరుతపులి దాడి చేయడంతో వారు గాయపడ్డారు. ఈ సంఘటనతో ఒంటరిగా ఎవరు పొలాలకు వెళ్లరాదని కట్టెలు, కటార్లు తీసుకునే బయటకు వెళ్లాలని బొందలవాడలో అధికారులు చాటింపు వేశారు. పొలానికి పురుగుల మందు పిచికారి చేయడానికి పొలం వద్దకు వెళ్లిన కోనంకి నాయుడుపై చిరుతపులి దాడి చేయడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

Read also: oney trap fraud : హనీట్రాప్ మోసం బట్టబయలు, యువకులను టార్గెట్ చేసిన మహిళ అరెస్ట్!

leopard attacked three people

leopard attacked three people

అదే విధంగా గ్రామంలో ఇంటి పనులు చేస్తుండగా వెనకాల నుంచి చిరుత లక్ష్మిదేవిపై దాడి చేసింది. ఈ విధంగా బొందల వాడ గ్రామంలో ముగ్గురిపై చిరుత దాడి చేయడంతో అటవీశాఖ అధికారులు గ్రామంలోకి వచ్చి అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతలు సంచరించిన వాటి అడుగుజాడలను పరిశీలించి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.