మంత్రి గొట్టిపాటి రవికుమార్
విజయవాడ : విజయవాడలోని దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని (AP) ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర వార్యాలయంలో మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం కలగడానికి గల కారణాలపై దేవాదాయ, విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. విద్యుత్ అంతరాయం విషయం తన దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిచామని వెల్లడించారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే దుర్గ గుడిలో కరెంట్ సరఫరా నిలిచి పోయిందన్నారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి ఉద్ఘాటించారు.
Read also: AP: మినీ అంగన్వాడీల స్థాయి పెంపు: మంత్రి సంధ్యారాణి
దుర్గగుడి ఘటనపై రాజకీయ విమర్శలు తగవని మంత్రి
జనవరి 6, 7 తేదీలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గ గుడి ఈవో, ముఖ్య అధికారులతో కలిసి సమావేశం కానున్నట్లు మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. (AP) సమన్వయ లోపం వల్ల జరిగిన ఈ చిన్న పొరపాటును పట్టుకొని రాజకీయ విమర్శలు చేయడం తగదని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. సనాతన ధర్మానికి మాత్రమే కాకుండా ఏ ధర్మానికైనా.. కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలపడం ఎంతో సంతోషదాయకమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. గత * ప్రభుత్వం తప్పులను చేసిన సరి దిద్దుతూ పునర్విభజన జరిగిందన్నారు. పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపినట్లు పేర్కొన్నారు. 2012 నుంచి అద్దంకి రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుతుండగా కూటమి ప్రభుత్వంలో సాకారమైనట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరించిన సిఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాటు మంత్రి వర్గ ఉపసంఘానికి మంత్రి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: