📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Latest News: AP: వైసిపి నేతల అక్రమాలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు వెల్లువ

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వారసత్వ భూమిపై మోసపూరిత రిజిస్ట్రేషన్..

విజయవాడ : అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామానికి చెందిన జయరాం అఖండ నాయక్ నేడు టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ తమ గ్రామ పరిధిలో వృత్తిరీత్యా కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాను. 2019–20 సంవత్సరంలో ఆర్అండ్ డిపార్ట్మెంట్ పరిధిలో గుట్టపల్లె-కోన నుంచి సంబేపల్లె వరకు (వయా శెట్టిపల్లె) సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మత్తుల పనులకు సంబంధించిన టెండర్ తనకు లభించింది సదరు పనిని పూర్తిగా నిర్వహించాను. అయితే అప్పటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యం. చిదంబర్ రెడ్డి అనే వ్యక్తి అన్యాయంగా జోక్యం చేసుకుని సదరు పనులకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటన వల్ల తనకు తీవ్ర ఆర్ధిక, మానసిక ఇబ్బందులు కలిగాయి. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు గుంటూరు కార్పొరేషన్ మేయర్ కోవెలమూడి నాని, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘు రామరాజులకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థించాడు. (Ap)చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఎంసీ కొత్తూరు గ్రామానికి చెందిన బాలాజీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమ కుటుంబానికి చెందిన సర్వే నెంబర్ 302/2, విస్తీర్ణం 2.45 సెంట్లు గల పిత్రార్జిత భూమిని ఇప్పటికీ తామే అనుభవంలో ఉంచుకుని సాగు చేసుకుంటున్నాం.

Read also: AP Gov: రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రణాళిక

A flood of complaints in the grievance cell against the illegal activities of YCP leaders.

పిత్రార్జిత భూమిపై మోసపూరిత రిజిస్ట్రేషన్ ఆరోపణలు

అయితే శ్రీవారి కుమార్ రాజు అనే వ్యక్తి 14 07 2008 తేదీన తమకు తెలియకుండా తమ తండ్రిని మోసం చేసి ఆ భూమిని తన పేరున రాసించుకున్నాడు. ఆ సమయంలో తాము అందరం మైనర్ లుగా ఉండటంతో(AP) ఈ అక్రమ రిజిస్ట్రేషన్ విషయం తెలియకపోయింది. ఇప్పుడు విషయం తెలిసిన తరువాత సంబంధిత అధికారులను ఆశ్రయించినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించి మోసపూరితంగా రాసుకున్న రిజిస్ట్రేషనన్ను రద్దు చేసి తమ పిత్రార్జిత భూమిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరం గ్రామానికి చెందిన సురేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజప్తి చేస్తూ.. పెదపాడు మండలం వసంతవాడ గ్రామానికి చెందిన వెంకట శ్రీరామ మూర్తి, జ్యోతి రవితేజ, నవ్యశ్రీ అనే వ్యక్తులు తమ ఇంటిని తనఖా పెట్టి 21 122022 తేదీన తన వద్ద నుంచి రూ.5,00,000/ (అక్షరాలా ఐదు లక్షల రూపాయలు) తీసుకున్నారు. ఒక సంవ త్సరంలో మొత్తం సొమ్మును తిరిగి చెల్లిస్తామని నమ్మ బలికారు. అయితే ఒక సంవత్సరం గడిచి రెండు నెలలు అయినప్పటికీ సొమ్ము తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే “మేము ఇవ్వము, మాకు రాజకీయంగా బలమైన వ్యక్తుల మద్దతు ఉంది అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

అప్పు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు

ఇటీవల మరలా డబ్బులు అడిగిన సందర్భం లో తమ వద్దకు వస్తే చంపుతామని బెదిరింపులు చేశారు. తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకము గ్రామానికి చెందిన రమేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం. 1341ఏ1 లో భూమి కలదు. ఆ భూమి నిషేదిత జాబితలో ఉన్నది. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ సంప్రదించగా ఆ భూమి వట్టా భూమి అని చెప్పారు. నిషేధిత జాబితాలో కొనసాగుతుండ టంతో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి నెలకొంది. తాను ముడివేముల గ్రామానికి చెందిన అన్నసూయ వద్ద నుండి సదరు స్థలాన్ని కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నాను. కావున సంబంధిత అధికారుల చేత సదరు భూమిని సమగ్రంగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మజాకోరువువారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి విజప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 12413లో ఉన్న భూమిని తమ తాత ఆకుల వెంకటస్వామి, తమ తండ్రి నారాయణప్పలు 1955 సంవత్సరం నుంచే సుమారు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటూ వచ్చారు. అయితే అదే గ్రామానికి చెందిన మునిరెడ్డి, అమ్మిరెడ్డి, రవీంద్రరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలిసి తాము సాగు చేస్తున్న భూమికి సంబంధించి తనకు తెలియకుండా ప్రభుత్వా నికి తప్పుడు రికార్డులు సమర్పించి భూమిని ఆక్రమం గా తమ పేర్లపై నమోదు చేసుకుని తరువాత ఇతరు లకు విక్రయించారు.

ఉద్యోగాలు, వైద్య సహాయం, ఆర్థిక తోడ్పాటు కోరుతూ అభ్యర్థనలు

ఈ విషయంపై రెవెన్యూ అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినప్పటికి ఎలాంటి న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన మందమ్మ గ్రీవెన్స్లోలో అర్జీ ఇచ్చి విజప్తి చేస్తూ.. తమకు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వేలుబండ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 500 చదరపు గజాల స్థలం ఉంది. సదరు స్థలం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయింది. అయితే తమ స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించారు. కావున తమ స్థలాన్ని గుర్తించి తమ న్యాయం చేయాలని కోరారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దేవలం కురవపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అర్జీ ఇచ్చి విజప్తి చేస్తూ.. ముష్టూరులో సర్వే నంబర్లు 179, 182లలో విస్తీర్ణం 4.39 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి తన, నారాయణ అనే వారిపై పేరుపై పట్టా మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్ధనలు అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Illegal Registration Land Dispute Latest News in Telugu Property Fraud Public Grievance TDP Grievance Cell Telugu News YSRCP Leaders Allegations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.