📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!

Author Icon By Rajitha
Updated: December 19, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. అనారోగ్యంతో మృతి చెందిన ఆరేళ్ల కొడుకును కోల్పోయిన ఓ తండ్రి, తన బిడ్డ సమాధి భద్రత కోసం CCTV Camera ఏర్పాటు చేశాడు. క్షుద్ర పూజల కోసం ఎవరైనా మృతదేహాన్ని తవ్వేస్తారేమోనన్న భయమే ఈ నిర్ణయానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విస్తృత చర్చకు దారి తీసింది.

Read also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

AP

కొడుకు మృతిని జీర్ణించుకోలేని తండ్రి

వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన దంపతుల ఆరేళ్ల కుమారుడు ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. సంప్రదాయం ప్రకారం బాలుడిని గ్రామ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే కొడుకు మృతిని జీర్ణించుకోలేని తండ్రి, సమాధి భద్రతపై అనుమానంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు.

ఈ భయంతోనే సమాధి వద్ద Solar Power ద్వారా పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆ కెమెరా ఫుటేజీ నేరుగా తండ్రి మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ అయి ఉండటంతో రోజూ సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల ఘటనలు లేవని స్పష్టం చేసినప్పటికీ, కన్నకొడుకు జ్ఞాపకాలతో జీవిస్తున్న ఆ తండ్రి మాత్రం తన బిడ్డ సమాధి రక్షణ కోసం నిఘాను కొనసాగిస్తూనే ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News latest news Telugu News Tirupati district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.