AP: ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఏలూరు ఎంపి పుట్టా మహేష్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి

విజయవాడ: ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను వారి ఇంటి వద్దకే అందించేందుకే (AP) డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ (Sukanta Majumdar) వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ కింద పనిచేసే స్వయంప్రతి సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఐఇఎల్ ఐటి), అక్టోబర్ 2025లో ఎన్ఐఇఎలాటి డిజిటల్ యూనివర్సిటీ (ఎన్టియు) ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దీని కార్యక్రమాలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సురాంత మజుందార్ సమాధానం ఇస్తూ ఎన్పి ఇఎల్బాటి డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో ఆన్లైన్, మిశ్రమ నైపుణ్య ఆధారిత కోర్సులను అందించడానికి ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని పేర్కొన్నారు.

Read Also: AP: ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

AP
A digital university at the global level

స్వయం ప్లస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు

సెమీకండక్టర్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఇండస్ట్రీ 4.0 మరియు ఇతర అభివృద్ధి చెండుతున్న డొమైన్లలో రియల్టైమ్ ప్రయోగాల కోసం ఈ ప్లాట్ఫామ్ పర్చువల్ ల్యాబ్లను కూడా కలిగి ఉన్నట్లు తెలిపారు. (AP) ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లోని కోర్సులు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్)కి అనుగుణంగా ఉంటాయి. క్రెడిట్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్కి బదిలీ చేయబడతాయి. ప్రస్తుతం ప్లాట్ఫామ్లో 100 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన కేంద్ర మంత్రి, వీటిని దేశవ్యాప్తంగా వినిలిగి యొక్క 56 కేంద్రాల నెట్వర్క్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు.

అంతేగాకుండా కోర్సులను నేర్చుకోవడంతో పాటు వారు తిరిగి నైపుణ్యాన్ని పెంచుకోవడం, ఉపాధికి అవకాశాలను పొందటానికి. ‘స్వయం ప్లస్’ ప్లాట్ఫాము ప్రారంభించినట్లు తెలిపారు. స్వయం ప్లస్ ద్వారా ఇప్పటివరకూ ప్రముఖ పరిశ్రమలతో 89 కంటే ఎక్కువ అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు, 4.84 లక్షల మంది తమ నైపుణ్య పెంపుదల కోసం దీనిలో పేర్లు నమోదు చేసుకున్నట్లు ఎంపీ పుట్టా మహేష్కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.