📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత ఏమైందంటే?

Author Icon By Anusha
Updated: January 24, 2026 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మైనర్ల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి (AP) లోని, విజయవాడ ప్రసాదంపాడులో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. 16 ఏళ్ల బాలిక ఇన్ స్టాలో పరిచయమైన బాలుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది. బాలిక కనిపించకపోవడంతో ఇటు తల్లి, అటు నేరుగా తమ ఇంటికి రావడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

Read Also: AP: తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల గడువు

బస్సు ఎక్కి నేరుగా ఆ బాలుడి ఇంటికి చేరుకుంది

వివరాల్లోకి వెళితే..పదో తరగతి చదివిన ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పామర్రు నియోజకవర్గం కూచిపూడికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నిరంతరం చాటింగ్ చేసుకుంటుండటాన్ని గమనించిన తల్లి, కూతురిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 21న బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పి రాత్రి ఎవరికీ తల్లికి తెలియకుండా బస్సు ఎక్కి నేరుగా కూచిపూడిలోని ఆ బాలుడి ఇంటికి చేరుకుంది.

AP: A boy introduced himself on Instagram…a girl who left home…what happened next?

మరుసటి రోజు బాలిక ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పటమట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు బాలుడి ఇన్‌స్టా ఐడీ ఆధారంగా వారి లోకేషన్‌ను కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బాలిక తమ ఇంటికి రావడం చూసి బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

ఆమెను ఇంటికి వెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, బాలిక నిరాకరించడమే కాకుండా వెనక్కి పంపితే చనిపోతాను అని బెదిరించింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా, అతి కష్టం మీద ఆమెను ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు కలిశారు. దీంతో వారిని స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లో బాలికకు, ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Instagram latest news minor girl Telugu News Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.