News Telugu: AP: ఏపీ క్యాడర్‌కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులు

Read Time:  1 min
8 more IAS officers to AP cadre
8 more IAS officers to AP cadre
FONT SIZE
GET APP

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి మరో 8 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులను కేటాయించింది. ఈ అధికారులు 2024 బ్యాచ్ కు చెందుతారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు అధికారిక లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. కేటాయింపులో ఆంధ్రప్రదేశ్, (AP) తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు.

Read also: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

8 more IAS officers to AP cadre

8 more IAS officers to AP cadre

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించిన 8 మంది అధికారులు

  • బన్నా వెంకటేష్ (AP)
  • ఏఆర్ పవన్ తేజ (AP)
  • కే ఆదిత్య శర్మ (TS)
  • చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (TS)
  • హరి ఓం పాండియా (Rajasthan)
  • నమ్రతా అగర్వాల్ (Haryana)
  • ప్రియ (Delhi)
  • సుయశ్ కుమార్ (UP)

ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు ఇతర రాష్ట్రాలకు కేటాయింపు పొందారు

  • చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డి – ఏజీఎంయూటీ (Arunachal Pradesh, Goa, Mizoram, UTs)
  • పీ సురేష్ – తెలంగాణ

UP, Haryana, Maharashtra, Gujarat, Karnataka, Delhi లాంటి రాష్ట్రాల టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులకూ తమ రాష్ట్ర క్యాడర్ కేటాయించబడింది. 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో మొత్తం 1,009 మంది ఎంపికయ్యారు, వీరిలో 725 పురుషులు, 284 మహిళలు. టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళలు ఉండడం గమనార్హం. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురి మహిళలు. ఈ పరీక్ష దేశంలో అత్యంత క్లిష్టమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఒకటి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.