ఆంధ్రప్రదేశ్ (AP) లో మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో విస్తృతంగా విజయవంతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు దాదాపు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి రోజువారీ ప్రయాణ అవసరాలను సులభతరం చేసిందన్నారు.
Read Also: Breaking News: Kakinada district accident:కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం
అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది
త్వరలోనే రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో నిన్న స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.మహిళలు ఉచితంగా ప్రయాణించేలా అన్ని ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. టికెట్ ఆదాయంపైనే ఆధారపడకుండా ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం ఆర్జించిందని మంత్రి వెల్లడించారు. కార్గో ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా అధికారులను ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలతో సత్కరించారు. అనంతరం విజయవాడ బస్టాండ్‌లోని కార్గో సర్వీసు నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: