(AP) కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించనుంది. పట్టణాల్లో విజయవంతమైన ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించే ఈ క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చనున్నాయి. ఇప్పటికే లక్షలాది మందికి ఈ పథకం అండగా నిలిచింది.
Read Also: Jyothi Yarraji: అథ్లెటిక్ జ్యోతికి ప్రభుత్వ సహకారం
(AP) రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
మరో 70 క్యాంటీన్లను మంజూరు
వీటిలో రోజూ మూడు పూటలా కలిపి 2 లక్షల మందికిపైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని పూటకు రూ.5కే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది.
పట్టణాలు, నగరాల్లో కొనసాగుతున్న 205 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేయగా, 2.62 కోట్ల మంది ఉదయం అల్పాహారం, 1.42 కోట్ల మంది రాత్రి అల్పాహారం పొందారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: