రాజకీయాల్లో మహిళా సాధికారతపై ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను త్వరలోనే అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనివారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహిళా నాయకత్వం రావాలి. మగవారితో సమానంగా ముందుకెళ్లాలి. వారికి ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పిస్తే నేను కాలేజీల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాను. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొందర్లోనే అది జరుగుతుంది. మహిళలు పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు’ అని పేర్కొన్నారు.
Read Also: Arava Sridhar Case: జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: