📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: రాష్ట్రంలో 3వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థులందరికీ సకాలంలో హెల్త్ చెకప్లు చేయండి: కలెక్టర్లకు సూచించిన సిఎం చంద్రబాబు

విజయవాడ : డ్వాక్రా గ్రూపుల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సిఎం చంద్రబాబు (chandrababu) ఆదేశించారు. కలెక్టర్లు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులు రావాలన్నారు. రూ. 20 లక్షలకోట్ల పెట్టుబడులు సాకారం అయితే… 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. దావోస్కు వెళ్లే ముందుగా 538 ఎంఒయులు, రూ.11.38 లక్షలకోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ ప్రాసెస్ మొదలు కావాలి అన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు వస్తాయి. మంత్రులు, కలెక్టర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను లాంచ్ చేసేలా కృషి చేయాలి అన్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ భూసేకరణ అత్యంత కీలకం… మేం ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడూ భూవివాదాలు రాలేదు. భూములిచ్చే వారు కూడా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.

Read also: financial system : ఆర్థికపంథా మారితేనే ముందడుగు

3,000 food processing units

హోటళ్లు కూడా పెద్ద ఎత్తున

సేవల రంగం కూడా మరింతగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో పర్యాటకం అభి వృద్ధి చెందాలంటే హోటళ్లు కూడా పెద్ద ఎత్తున నిర్మితం కావాలన్నారు. గిగ్ వర్కర్ల కోసం వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాలు కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లేన్ చేయండి… ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాప కుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారకానికి మచిలీపట్నంలో 2 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోనే టౌన్ షిప్ అభివృద్ధి చేయండి. ఇక సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపోందించాలి. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలి.

విద్యార్ధులకు వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు

పార్వతిపురం మన్యం జిల్లాలో జరుగుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి. హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేస్తాను, ఆ తర్వాత మాట్లాడ తాను. జిల్లా కలెక్టర్లు సంక్షేమహాస్టళ్లలో నిద్రచేయాలి. విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ చేయండి. రక్త హీనత సహా వేర్వేరు ఇబ్బందులు గుర్తించండి. 7,8,9,10, ఇంటర్ విద్యార్ధులకువారిలో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం వంటి వాటిని అమలుచేయండి. పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి. రోజూవారిని ఆడించేలా చర్యలు తీసుకోవాలి. గిరిజన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికయ్యారు. సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడిన విద్యా ర్ధుల కెరీర్ ప్లానింగ్ చేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ప్రకృతితో మమేకం కావడానికి గిరిజన సంప్రదాయా లను చూసేందుకు పర్యాటకం పెరిగే అవకాశం. బ్రాహ్మణ కార్పోరేషన్లోనూ మంచి ప్రయోగం చేశారు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.