సచివాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 48వ శాసనమండలి (AP Legislative Council) 3వ రోజు సోమవారం ఉదయం 10గంటలకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలవగానే వైకాపా ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కుంభా రవిబాబు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ, పీపీపీ విధానంపై ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించినట్లు మండలి చైర్మన్ తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో పేరాబత్తుల రాజశేఖరం నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ గురించి ప్రశ్నించగా పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ 2029 నాటికి 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు వివిధ విధానాలు పథక మార్గదర్శకాలను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
తదుపరి జూన్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో
ఇప్పటికే మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా సుమారు 16 వేల పోస్టులకు ప్రకటన జారీ చేయగా ఇప్పటికే 15వేల మందికి పైగా ఎంపిక పూర్తయిందని, తదుపరి జూన్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ 4,179, ఒప్పంద పరమైన ఉద్యోగులు 2046, ఆవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2,868 తో కలిపి 9,903మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
అంతే కాకుండా వివిధ విభాగాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా జూన్ 2024 నుంచి రాష్ట్రంలో 3.48 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని,అదనంగా నైపుణ్యాభివృద్ధి నిర్వహించిన జాబ్మేళాల ద్వారా దాదాపు 82,012మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక చట్టం 1977, సవరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ బిక్షాటన నిరోధక చట్టం (Andhra Pradesh Anti-Begging Act 2025) గా పేర్కొంటూ,
రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగడం,
ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నిరోధక చట్టం 1977లోని క్లాస్(6)లో సబ్ క్లాస్(2)లో కుష్టురోగి లేదా పిచ్చివాడు అను పదములకు బదులుగా కుష్టువ్యాధి బాధిత వ్యక్తి లేదా మానసిక అనారోగ్యం గల వ్యక్తిగా మారుస్తూ సవరణలను ప్రతిపాదించగా మండలి ఆమోదం తెలిపింది.

ఈ చట్టం ప్రకారం కమీషన్ చైర్మన్ లేదా సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేది నుండి రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగడం, ఆ సభ్యుల వయోపరిమితిని సడలిస్తూ అంటే 65సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచుతూ చేసిన సవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ దుకాణాలు స్థాపనల చట్టం, (Andhra Pradesh Shop Establishments Act 1980) సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) చట్టం 2025ని పరిశ్రమల శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ మండలిలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఏ దుకాణంలోని ఉద్యోగి అయినా ఏ రోజైన పది గంటలకు మించి, ఏ వారంలోనైనా 48గంటలకు మించి పని చేయకూడదని లేదా అనుమతించకూడదని తెలిపారు.
ఈ బిల్లుకు వివక్ష నేతల నుండి కొంత వ్యతిరేకత
రాత్రిపూట మహిళలు పూర్తి భద్రతల నడుమ పనిచేయవచ్చ వంటి సవరణలతో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు విపక్ష నేతల నుండి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో
మండలిలో బిల్లుకు ఆమోదం దక్కింది. జీఎస్టీ 2.0పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 22వ తేది నుండి అక్టోబర్ 25వరకు నెలరోజులపాటు జిల్లా,
గ్రామ స్థాయి వరకు బృహత్తరమై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, వాణిజ్య పన్నులు, పంచాయతీరాజ్ శాఖాధికారులు ఈ బృహత్తరమైన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: