ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా దళాలు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు,కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు.
Read Also: Republic Day 2026 : అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం
సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం
ఈ సందర్బంగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభ క్షణాన్ని పంచుకోవడం గర్వకారణమని అన్నారు. ఏపీ ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులని, ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, సంస్థలు తిరిగి బలపడుతున్నాయని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని తెలిపారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని, కలిసి కట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని గవర్నర్ పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: