📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్

Author Icon By Aanusha
Updated: October 15, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోడ్డు యక్సిడెంట్లు, పాము కాట్లు, సడెన్ హార్ట్ అటాక్స్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగే సందర్భాల్లో గోల్డెన్ అవర్ అనేది అత్యంత కీలక సమయం. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి తక్షణ వైద్యం అందిస్తే, గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే, గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో, అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

Read Also: Mangalagiri: గూగుల్ తో పాటు డీలర్ షిప్‌లు కూడా ముఖ్యమే: లోకేశ్

ప్రస్తుతం రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఉన్న అంబులెన్స్‌లలో చాలా తరచుగా రిపేర్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సమయానికి వైద్యం అందించడం కష్టం అవుతోంది. ముఖ్యంగా, గ్రామీణ, అందుబాటులోకి దూరమైన ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల సౌలభ్యాన్ని పెంపొందించడానికి, 190 కొత్త 108 అంబులెన్స్‌లు త్వరలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ప్రకటించారు. ఈ కొత్త వాహనాలు గోల్డెన్ అవర్ లో నిరంతర సేవ అందించడానికి ఉపయోగపడతాయి.

గోల్డెన్‌ అవర్‌లోనే క్షతగాత్రులు వైద్యం

ఇప్పుడున్న అంబులెన్స్‌లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్‌లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్‌లను తొలగిస్తామని చెప్పారు.

వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్‌ అవర్‌లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.త్వరలో ప్రారంంభించనున్న 190 కొత్త 108 వాహనాల్లో.. 56 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్, 136 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సులు ఉన్నాయి.

AP

తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు నడుస్తున్నాయని.. పాత వాటిని తొలగించి.. కొత్త వాటితో కలిపితే.. వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో అంబులెన్స్‌లు ఉండేవని చెప్పిన సత్య కుమార్.. కొత్త అంబులెన్స్‌లు నేషనల్ అంబులెన్స్‌ కోడ్‌ (NAC) ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని వెల్లడించారు.

గత నెలలోనే ప్రభుత్వం ఈ మేరకు పాత రంగులు మార్చుతున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ 108 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంబులెన్స్‌ల నిర్వహణను పట్టించుకోలేదని.. వాల కాలం చెల్లిన అంబులెన్స్‌ (Ambulance) లను ఉపయోగించిందని అన్నారు.

ఫలితంగా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. 108 అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం పెరిగిందని మంత్రి ఆరోపించారు.2023 జులైలో తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌ల స్థానంలో అప్పటి ప్రభుత్వం 146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించింది. వీటి కోసం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా 2020లో 412 కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

108 Ambulance Breaking News latest news Satya Kumar Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.