AP: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్

Read Time:  1 min
AP: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్
FONT SIZE
GET APP

విజయవాడ : కృషా జిల్లా పెనమలూరు మండలం (AP) పోరంకిలోని ఓ జూనియర్ కళాశాల హస్టల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి (Student) ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో గన్నవరం డిఎసిపి చలసాని శ్రీనివాసరావు, పెనమలూరు సిఐ జె వెంకట రమణ ఈ సంఘటనకు సంబంధించిన వివరా లను మీడియాకు తెలిపారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం బంగారుమెట్టకు చెందిన మొల్లి పవన్ కుమార్ (17), తోటి విద్యార్థి హేమంత్ స్నేహంగా ఉండే వారు. గతేడాది డిసెంబరులో వారి మధ్య వివాదం తలె త్తింది. హేమంత్ మంచివాడు కాదని, అతనితో మాట్లాడ వద్దని తోటి విద్యార్థులకు పవన్కుమార్ చెప్పాడు.

Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

AP: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్

విద్యార్థుల పేర్లను చేతి పై రాసుకుని ఆత్మహత్య

ఈ నేపథ్యంలో (AP) హేమంత్ తో పటు కళాశాల హాస్టల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు జనవరి 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పవన్ కుమార్ రూమ్కు వెళ్లి ఆయనను కొట్టారు. దీన్ని వీడియోతీసి ఇన్స్టాలో పోస్టుచేశారు. జనవరి 30న మళ్లీ దాడి చేసి కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన పవన్ కుమార్ జనవరి 31వ తేదీ సాయంత్రం స్టడీ అవర్కు వెళ్లకుండా తనను కొట్టి అవమా నించిన ఆరుగురు విద్యార్థుల పేర్లను తన చేతి మణి కట్టుపై రాసుకుని హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కళాశాల ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్ఛార్జి రవీంద్ర, మెస్ బారు హేమంత్, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ సంఘటన స్థలానికి వెళ్లారు. జరిగిన విషయం బయటకు పొక్కకుండా వారు జాగ్రత్త పడ్డారు. ఆధారాలు లేకుండా చేసారు. ఈ విషయంలో మృతుని సన్నిహితుల ద్వారా విషయం బయటకు పొక్కింది. యాజమాన్యం వారిని బెదిరించింది, అయితే పవన్కుమార్ తల్లిదండ్రులు అతని ఆత్మహత్య ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో గుట్టురట్టుకావడంతో నిందితులందరిని అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.