📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: 10th పబ్లిక్‌ పరీక్షల తేదీలు విడుదల?

Author Icon By Aanusha
Updated: November 18, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో 2026 మా­ర్చిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ పరీక్షల ఖరారైన తేదీలపై విద్యాశాఖలో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.

Read Also: AP High Court: వారందరికి వెంటనే డబ్బులు చెల్లించండి: ఏపీ హైకోర్టు

ఈ రెండింటిలో ప్రభుత్వం దేనికి అనుమతి ఇస్తే.. ఆ ప్రకారంగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈలోగా పరీక్షల సిబ్బంది నియామకం, ఇన్విజిలే­టర్ల ఎంపిక, పరీక్ష సెంటర్ల గుర్తింపుపై అధికారులు దృష్టి సారించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.50 లక్షల­మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

మొత్తం 3,500 సెంటర్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షల నిర్వహణకు 35 వేల­మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించే పనిలో విద్యాశాఖ పడింది. వీరితోపాటు మరో రెండువేల మంది స్క్వాడ్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంది. గతేడాది ఇన్విజిలేటర్ల ఎంపికను జిల్లాల్లో చేపట్టగా, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ నుంచే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

AP: 10th public exam dates released?

పరీక్ష విధులకు దూ­రం పెట్టాలని

అంతేకాకుండా ఈసారి ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ­లను ఇన్విజిలేటర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు.ఇందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యా­యుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డైరెక్టరేట్‌ అధికారులు జిల్లా అధికారు­లను ఆదేశించారు.

అయితే వీరిలో గతంలో చార్జి మెమోలు తీసు­కు­న్నవారు, సస్పెన్షన్‌కు గురైనవారు, దీర్ఘకాలిక ఆరో­గ్య సమస్యలున్నవారిని పరీక్ష విధులకు దూ­రం పెట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. అలాగే స్కూల్‌ అసిస్టెంట్ల విషయంలోనూ ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు పరీక్ష విధులకు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా గతేడాది పదో తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో ప్రత్యక్ష­మైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది అలాంటి పొరబాట్లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలోగా పరీక్షల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP 10th class exams 2026 AP Education Department AP SSC exams AP timetable 2026 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.