📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో: కీలక షెడ్యూల్ సిద్ధం

Author Icon By Tejaswini Y
Updated: November 20, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదో తరగతి విద్యార్థులకు ముఖ్య అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌(AP)లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే ఖచ్చితమైన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మార్చి 16తో ఒక టైమ్‌టేబుల్‌, మార్చి 21తో మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వం ఏదిని ఎంపిక చేస్తే, దాని ప్రకారమే పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

Read Also: Odisha: చిప్స్ ప్యాకెట్ లో ఉన్న బొమ్మను మింగేసిన బాలుడు.. పరుగులు తీసిన పేరెంట్స్ 

3,500 పరీక్ష కేంద్రాలు

AP 10th class public exams in March Key schedule ready

ఇదిలా ఉండగా, పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల విద్యార్థులు ఈసారి పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 35 వేల మంది ఇన్విజిలేటర్లు మరియు సహాయక సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి అదనంగా 2,000 మంది స్క్వాడ్ సభ్యులు అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు వంటి ఉపాధ్యాయుల

గత ఏడాది ఇన్విజిలేటర్ల ఎంపిక జిల్లా స్థాయిలో జరిగితే, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ నేరుగా ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనుంది. ఇందుకు స్కూల్(School) అసిస్టెంట్లు, ఎస్జీటీలు వంటి ఉపాధ్యాయుల వివరాలను రాష్ట్రంలోని ప్రతి పాఠశాల నుండి సేకరించాలని జిల్లా అధికారులకు సూచించారు.

అల్పకాలంలో చార్జ్ మెమోలు పొందిన వారు, సస్పెన్షన్‌కు గురైన వారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిని పరీక్ష విధులకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అంతేకాకుండా సంబంధిత సబ్జెక్టు టీచర్లు తమ సబ్జెక్టు పరీక్ష రోజున ఇన్విజిలేటర్ డ్యూటీలో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

10th Class Exams AP Andhra Pradesh Schools AP Board Updates AP Education News AP SSC exams SSC Public Exams 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.