పదో తరగతి విద్యార్థులకు ముఖ్య అలర్ట్. ఆంధ్రప్రదేశ్(AP)లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే ఖచ్చితమైన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మార్చి 16తో ఒక టైమ్‌టేబుల్, మార్చి 21తో మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వం ఏదిని ఎంపిక చేస్తే, దాని ప్రకారమే పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
Read Also: Odisha: చిప్స్ ప్యాకెట్ లో ఉన్న బొమ్మను మింగేసిన బాలుడు.. పరుగులు తీసిన పేరెంట్స్
3,500 పరీక్ష కేంద్రాలు

ఇదిలా ఉండగా, పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల విద్యార్థులు ఈసారి పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 35 వేల మంది ఇన్విజిలేటర్లు మరియు సహాయక సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి అదనంగా 2,000 మంది స్క్వాడ్ సభ్యులు అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు వంటి ఉపాధ్యాయుల
గత ఏడాది ఇన్విజిలేటర్ల ఎంపిక జిల్లా స్థాయిలో జరిగితే, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ నేరుగా ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనుంది. ఇందుకు స్కూల్(School) అసిస్టెంట్లు, ఎస్జీటీలు వంటి ఉపాధ్యాయుల వివరాలను రాష్ట్రంలోని ప్రతి పాఠశాల నుండి సేకరించాలని జిల్లా అధికారులకు సూచించారు.
అల్పకాలంలో చార్జ్ మెమోలు పొందిన వారు, సస్పెన్షన్‌కు గురైన వారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిని పరీక్ష విధులకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అంతేకాకుండా సంబంధిత సబ్జెక్టు టీచర్లు తమ సబ్జెక్టు పరీక్ష రోజున ఇన్విజిలేటర్ డ్యూటీలో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: