📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP 10th Class Exams: అయ్యో ఎంత కష్టం సిలిండర్‌ మాస్క్‌తో పరీక్ష

Author Icon By Saritha
Updated: March 17, 2026 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP 10th Class Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక విద్యార్థి చూపిన పట్టుదల అందరినీ కదిలిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, చదువుపై ఉన్న మక్కువతో ఆ బాలుడు ఆక్సిజన్ సిలిండర్ సాయంతో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నా, ఆక్సిజన్ మాస్క్ ధరించి మరీ పరీక్ష రాసి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్‌చంద్‌ కొన్ని రోజులు గా ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు.

Read Also: AP Govt : కొత్త ఇల్లు కట్టుకునేవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP 10th Class Exams: Oh, What a Struggle Taking the Exam with a Cylinder Mask

అధికారుల అనుమతితో సిలిండర్‌ మాస్క్‌తో పరీక్ష

అయితే ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలకుపైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో.. కౌశిక్ తల్లిదండ్రులకు అంత ఖర్చు భరించే స్థోమత లేదని తల్లిదండ్రులు ప్రస్తుతానికి ఇంటి దగ్గర తాత్కాలికంగా వైద్యం చేయిస్తున్నారు. స్థానిక ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.. అయితే పబ్లిక్‌ పరీక్షలు రాయాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. ఎంత కష్టమైనా సరే పరీక్షలు రాయాలని భావించాడు. వెంటనే అధికారుల అనుమతి తీసుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌ను పరీక్ష హాలులోకి తీసుకు వచ్చి మరీ పరీక్షలు రాస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP SSC Exams 2026 Inspiring student story Koushik Chand Prakasam Lung transplant issue Oxygen cylinder in exam hall

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.